Wednesday, January 22, 2025

యూపీలో మూడంతస్తుల భవనం కుప్పకూలి ముగ్గురి మృతి

- Advertisement -
- Advertisement -

బారబంకి (యూపీ) : ఉత్తరప్రదేశ్ లోని బారబంకిలో సోమవారం తెల్లవారు జామున మూడంతస్తుల భవనం కుప్పకూలి ముగ్గురు మృతి చెందారు. 10 మంది గాయపడ్డారు. శిధిలాల కింద ఇరుక్కున్న ఇద్దరిని ఎన్‌డిఆర్‌ఎఫ్,ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు కలిసి వారిని బయటకు తీసి రక్షించడానికి ప్రయత్నించారు. అయితే చికిత్స పొందుతూ రోషిణి (22). హకీముద్దీన్ ( 28) మృతి చెందారు. శిధిలాలనుంచి 20 ఏళ్ల మరో యువకుని మృతదేహాన్ని వెలికి తీశారు. సోమవారం తెల్లవారు జామున 3.15 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. భవనం శిధిలాల కింద 15 మంది చిక్కుకుని ఉండగా, 12 మందిని రక్షించగలిగారు.

వారిని బారబంకి జిల్లా ఆస్పత్రిలో చేర్చారు. వీరిలో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించగా, మరో ఎనిమిది మందిని మెరుగైన వైద్యం కోసం లక్నో లోని కింగ్‌జార్జి మెడికల్ యూనివర్శిటీకి తరలించారు. కుప్పకూలిన భవనం యజమాని హషీంగా గుర్తించినట్టు బారబంకి ఎస్‌పి దినేశ్ కుమార్ సింగ్ చెప్పారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ సంతాపం వెలిబుచ్చారు. రాష్ట్ర మంత్రి సతీష్ శర్మ, స్థానిక ఎంఎల్‌ఎ సాకేంద్ర ప్రతాప్ వర్మ , సీనియర్ అధికారులు, జిల్లా యంత్రాంగం , పోలీస్‌లు ప్రమాదస్థలం వద్దకు చేరుకుని సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News