Wednesday, January 22, 2025

అమెరికాలో కాల్పులు: ముగ్గురు విద్యార్థులు మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో దుండగుడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వర్సటీ క్యాంపస్‌లో రెండు చోట్ల దుండగుడు కాల్పులు జరిపాడు. కాల్పులు తరువాత దుండగుడు పారిపోయారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మిచిగాన్ యూనివర్సిటీలో 50 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులు సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని అధికారులు సూచన చేస్తున్నారు. మిచిగాన్ యూనివర్సిటీలో 48 గంటల పాటు కార్యకలాపాలు రద్దు చేశారు. మృతి చెందిన విద్యార్థుల వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News