Sunday, January 19, 2025

ఒడిశాలో పాము కాటుకు ముగ్గురు విద్యార్థుల మృతి

- Advertisement -
- Advertisement -

కియోంఝర్ : ఒడిశా కియోంఝర్ జిల్లా నిశ్చింతపూర్ గ్రామంలో ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్న ముగ్గురు విద్యార్థులు పాము కాటుకు ప్రాణాలు కోల్పోయారు. శనివారం రాత్రి మొత్తం నలుగురు విద్యార్థులు నేలపై పడుకుని ఉండగా పాము కాటు వేసింది. వెంటనే వీరిని కియోంఝర్ జిల్లా ఆస్పత్రికి తరలించగా, వారిలో ముగ్గురు చనిపోయినట్టు డాక్టర్లు ప్రకటించారు. మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో కటక్ లోని ఎస్‌సిబి మెడికల్ కాలేజీ, ఆస్పత్రికి తరలించారు. మృతులు రాజా నాయక్, సేహశ్రీ నాయక్, ఎలినా నాయక్‌గా గుర్తించారు. వీరంతా 12 ఏళ్ల లోపు వారే. మరో విద్యార్థి ఆకాష్ నాయక్ కటక్‌లో చికిత్స పొందుతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News