Thursday, November 21, 2024

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి

- Advertisement -
- Advertisement -

అతివేగం తో దూసుకువచ్చిన ఓ కారు ఎదురుగా వస్తున్న కెమికల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న బిటెక్ విద్యార్థుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నగర శివారు దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఈ దుర్ఘటన శుక్రవారం రాత్రి జరిగింది.మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి విఎన్‌ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాలకు చెందిన బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అక్షయ్, అస్మిత్, నవనీత్, జవాం త్ నలుగురు కళాశాల నుండి సరదాగా బ యటకు వచ్చి మరో వ్యక్తి హరితో కలిసి మొ త్తం ఐదుగురు కలిసి కారులో బయలుదేరారు. దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డులో ప్రయాణిస్తున్న సోడా ర్యాపిడ్ కారు లో బౌరంపేట వైపు వెళుతున్నారు.

అదే సమయంలో అటుగా ఎదురుగా వస్తున్న కెమిక ల్ వర్జిన్ కంపెని ట్యాంకర్‌ను వేగంగా దూ సుకువచ్చి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అ యింది. కారు డ్రైవ్ చేస్తున్న అక్షయ్‌తోపాటు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులు నవనీత్, జవాంత్‌లను అంబులెన్స్ ద్వారా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కారులో ఇరుక్కుపోయిన అస్మిత్,హరి,అక్షయ్ మృతదేహాలను వెలికితిసిన పోలీసులు వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వీరంతా బాచుపల్లికి చెందిన కళాశాలకు చెందిన వారని, హరి ఇతర కళాశాలకు చెందిన విద్యార్ద్థి అని పోలీసులు తెలిపారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అయితే వీరు మద్యం సేవించి కారు నడిపి ప్రమాదానికి గురయ్యారా? లేక అతివేగం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఘటనా స్థలాన్ని దుండిగల్ సిఐ శంకరయ్య, జీడిమెట్ల ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్ సందర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News