- Advertisement -
భువనేశ్వర్ : ఒడిశా భద్రక్ జిల్లా నలియాలో మంగళవారం నలుగురు విద్యార్థులు ఈతకొట్టేందుకు నలియా నదికి వెళ్లి నీట మునిగారు. వీరి కేకలు విని స్థానికులు అక్కడకు చేరుకుని వీరిని రక్షించారు. వీరిని నీటిలో నుంచి బయటకు తీసి భద్రక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోగా, మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు
- Advertisement -