- Advertisement -
హైదరాబాద్: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట వినాయకనగర్ లో గురువారం చోటుచేసుకుంది. తల్లి దివ్య(33), కుమారుడితో కలిసి ఆత్మహత్యుకు ప్రయత్నించింది. దివ్య తల్లి లలిత(56), ఏడాదిన్నర కుమారుడు శివకార్తికేయ మృతిచెందారు. ప్రస్తుతం దివ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కుటుంబకలహాలతోనే ఆత్మహత్యకు యత్నించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
- Advertisement -