Monday, March 17, 2025

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకులపల్లికి చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళితే.. టేకులపల్లికి చెందిన మాజీ ఎంపిటిసి మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ పవిత్రదేవిలకు ఇద్దరు కుమార్తెలు. వారిలో రెండో కుమార్తె ప్రగతి రెడ్డిని సిద్ధిపేట సమీపంలో ఉన్న బక్రి చప్రియాల్‌కు చెందిన రోహిత్ రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు. రోహిత్ తల్లి సునీత కూడా వారితోపాటే అమెరికాలో ఉంటుంది. అయితే ఇద్దరు పిల్లలు, రోహిత్, ప్రగతి, సునీత కారులో వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రగతి(35), అర్విన్(6), సునీత(56) అక్కడికక్కడే మృతి చెందగా.. రోహిత్, చిన్నకుమారుడికి గాయలయ్యాయి. వీరి మృతితో టేకులపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News