Monday, December 23, 2024

కశ్మీరులో ఎన్‌కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

Three terrorists killed in Encounter at Kashmir

శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని బడ్గామ్ జిల్లాలో భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పులలో ముగ్గురు జైషే మొహమ్మద్(జెఇఎం) ఉగ్రవాదులు మరణించారు. గురువారం రాత్రి జోల్వా గ్రామంలో ఎన్‌కౌంటర్ జరిగినట్లు కశ్మీరు ఐజి విజయ్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ముగ్గురు ఉగ్రవాదులు జెఇఎంకు చెందిన సభ్యులని ఆయన చెప్పారు. వారి నుంచి మూడు ఎకె 56 తుపాకులు, ఇతర నిషేధిత వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News