Monday, November 18, 2024

ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న ముగ్గురు దొంగల అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో : ద్విచక్రవాహనాలను దొంగిలించి వాటిని అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టును బాలా నగర్ సిసిఎస్, జీడిమెట్ల పోలీసు లురట్టు చేశారు. ద్విచక్రవాహనాల దొంగిలిస్తున్న ముగ్గురు పేరుమోసిన దొం గలను అదుపులోకి తీసుకుని వారి నుంచి 27 ద్విచక్రవాహనాలు, ఒక ఆటో మొత్తం రూ.22.20 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ందుకు సంబంధించిన వివరాలను బుధవారం సైబరాబాద్ పోలీసు కమిషన ర్ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్లడించారు.

వికారాబాద్ జిల్లాకు చెందిన బో యిని శ్రీకాంత్, మేఠారి భాస్కర్, మెట్టు శ్రీకాంత్‌లు ముఠాగా ఏర్పడి సైబరాబాద్, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లతో పాటు వికారాబాద్ జిల్లా పరిధిలో ద్విచక్రవాహనాలతో పాటు ఇతర వాహనాలను దొంగిలించి వాటికి తప్పుడు ధృవీకరణ పత్రాలను సృష్టించి అమ్ముతున్నట్లు వెల్లడించారు.

ఈ నేరస్థులపై ఇ ప్పటికే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 15 కేసులున్నాయని, వారు జైలుకు వెళ్లి విడుదలైన తర్వాత మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. ఇదేక్రమంలో ఎసిపి హసీబుల్లా పర్యవేక్షణలో బాలానగర్ సిసిఎస్ ఇన్‌స్పెక్టర్ కె.బాలరాజు నేతృత్వంలో సిసిఎస్ బృందం నిందుతులపై ప్రత్యేక నిఘా పెట్టి వారిని అరెస్టు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. నిందుతులను చాకచక్యంగా పట్టుకున్న సిసిఎస్, పోలీసు బృందాలను సిపి అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News