- Advertisement -
బెంగళూరు : కర్ణాటకలో మూడు వేల మంది కొవిడ్ రోగుల జాడ తెలియడం లేదని కర్ణాటక రెవెన్యూ మంత్రి అశోక వెల్లడించారు. కరోనా నిర్ధారణ అయిన తరువాత వీరిలో చాలామంది తమ ఫోన్లు స్విచాఫ్ చేసుకున్నారని వారందరినీ గాలించాలని పోలీసులను ఆదేశించినట్టు చెప్పారు. వీరి వల్లే రాష్ట్రంలో కరోనా ఉధృతి పెరుగుతుందని ఆయన అన్నారు. వీరు తమ ఇళ్లలో కూడా కనిపించడం లేదని, ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదని ఆయన చెప్పారు. వీరి ఆచూకీ తెలియక పోవడంతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. కరోనా బాధితులకు ఉచితంగానే ఔషధాలు ఇస్తుండడంతో 90 శాతం మంది ఇంటి వద్దనే కోలుకుంటున్నారని, కానీ కొందరు ఈ విధంగా అదృశ్యమై పరిస్థితి చెయిదాటిన తరువాత ఆస్పత్రికి ఐసియు పడకల కోసం వస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
- Advertisement -