Monday, December 23, 2024

నార్మల్ డెలివరీలు చేయిస్తే రూ. 3వేల పారితోషికం

- Advertisement -
- Advertisement -

three thousand reward for making normal deliveries: Harish rao

 

సిద్దిపేట: ప్రభుత్వ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీలు చేయిస్తే ఆశా కార్యకర్తలు, ఏఎన్ఏం, స్టాఫ్ నర్సులు, వైద్య వర్గాలకు రూ.3వేల పారితోషికం అందిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. గోల్డెన్ అవర్ మొదటి గంటలో బిడ్డకు తల్లిపాలు ఎంత ముఖ్యమో ప్రాముఖ్యత వివరిస్తూ.. మొదటి గంటలో బిడ్డకు తల్లిపాలు తాగించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. పీహెచ్ సీలో ఈ ఔషధి, కుక్కకాటు, పాముకాటు ఇతరత్రా వ్యాధుల మందులు మూడు నెలలకు సరిపడేలా స్టాక్ ఉన్నాయా.. లేదా అని ఫార్మాసిస్టును ఆరా తీశారు. అవసరమైన మందులు తెప్పించి పెట్టాలని డీఏంహెచ్ఓ డాక్టర్ కాశీనాథ్ ను ఆదేశించారు.

అక్కన్నపేట మండలంలో క్యాంపు నిర్వహించి పైసా ఖర్చు లేకుండా క్యాటారాక్ట్ కంటి ఆపరేషన్లు ఉచితంగా చేస్తామని, అలాగే 3 లక్షల ఖర్చుతో కూడిన మోకాలి చిప్ప ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తామని మంత్రి చెప్పారు. 1300 వైద్య ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే సతీష్, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. ఆరోగ్య మంత్రి హరీశ్ రావు చొరవతో అక్కన్నపేట మండలం రామవరం గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పూర్వ వైభవం వచ్చిందని స్థానిక ప్రజాప్రతినిధుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు పీహెచ్ సీలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ కాశీనాథ్ హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ గారి బీపీ చెకప్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News