Sunday, December 22, 2024

బాలికపై ముగ్గురు ట్యూషన్ టీచర్ల అత్యాచారం

- Advertisement -
- Advertisement -

ఇద్దరు అరెస్ట్ , ఒకరు పరారీ

ముంబై : సౌత్ ముంబైలో 13 ఏళ్ల బాలికను ఆమె ట్యూషన్ టీచర్లు ముగ్గురు అనేక సార్లు అత్యాచారానికి పాల్పడిన సంఘటన బయటపడింది. నిందితుల్లో గౌతమ్, తరుణ్ రాజ్‌పురోహిత్ లను సెప్టెంబర్ 28న అరెస్ట్ చేశారు. మరొక నిందితుడు సత్యరాజ్ పరారీలో ఉన్నాడని పోలీస్‌లు చెప్పారు. ముగ్గురు నిందితులు బాలికపై ట్యూషన్ చెబుతూ లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా అశ్లీలకరమైన చిత్రాలను, వీడియోను చూపించేవారని పోలీస్‌లు వివరించారు. బాధితురాలి తల్లి మొదట్లో పోలీస్‌లకు ఫిర్యాదు చేయడానికి ఒప్పుకోలేదు.

అయితే కౌన్సిలర్ ఆమెను ఒప్పించి ఫిర్యాదు చేయించినట్టు తెలిసింది. బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేశామని పోలీస్‌లు తెలియజేశారు. బాధితురాలిని పడకగదిలోకి తీసుకెళ్లేవారని, అశ్లీల చిత్రాలు చూపించి అత్యాచారానికి పాల్పడేవారని బాధితురాలు చెప్పినట్టు పోలీస్‌లు పేర్కొన్నారు. బాధితురాలి తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో ఇంట్లో మగదిక్కులేని పరిస్థితిని ఆసరా చేసుకుని నిందితులు అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీస్‌లు చెప్పారు. వివిధ సెక్షన్లతోపాటు పోక్సో చట్టం కింద కూడా నిందితులపై నేరాలు నమోదు చేయడమైందని పోలీస్‌లు వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News