Thursday, January 23, 2025

ఆస్ట్రేలియాలో కూలిన అమెరికా సైనిక హెలికాప్టర్.. ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

కాన్‌బెర్రా : అమెరికాకు చెందిన ఎంవీ 22బీ ఓస్ప్రే సైనిక హెలికాప్టర్ ఆస్ట్రేలియా లోని మాల్విల్ ద్వీపం వద్ద ఆదివారం కూలిపోవడంతో ముగ్గురు మెరైన్స్ మరణించగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆస్ట్రేలియాలో ప్రిడేటర్ రన్ పేరిట ప్రస్తుతం యుద్ధ విన్యాసాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా దాదాపు 23 మందితో ఈ హెలికాప్టర్ ఆస్ట్రేలియా లోని ఉత్తర డార్విన్ ప్రాంతం లోని తివి ద్వీపం వద్దకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

తీవ్రంగా గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి క్లిష్టంగా ఉండడంతో మాల్విల్ ద్వీపం నుంచి 80 కిమీ దూరం లోని డార్విన్ నగరానికి ఆస్పత్రి చికిత్సకు తరలించినట్టు నార్తర్న్ టెరిటరీ పోలీస్ కమిషనర్ మైకేల్ మర్ఫీ వెల్లడించారు. మిగతా వారిని అక్కడ నుంచి తరలించడానికి హెలికాప్టర్లు పంపారు. ప్రస్తుతం శకలాలను గుర్తించే కార్యక్రమం జరుగుతోందని, ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని డార్విన్ రొటేషనల్ ఫోర్స్ ప్రకటించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News