Sunday, January 19, 2025

చత్తీస్‌గఢ్ కాంకేర్ జిల్లాలో ముగ్గురిని చంపేసిన నక్సల్స్

- Advertisement -
- Advertisement -

కంకేర్: చత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలోమహారాష్ట్ర పోలీసులకు ఇన్ఫార్మర్లుగా అనుమానించిన ముగ్గురిని నక్సలైట్లు హత్య చేశారు. ఈ సంఘటనకు సంబంధించి తమకు సమాచారం అందిందని, దీనికి సంబంధించి తదుపరి వివరాలను సేకరిస్తున్నామని చత్తీస్‌గఢ్ పోలీసులు ఒక ప్రకటనలో తెలియజేశారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాకు ఆనుకుని ఉన్న కంకేర్ జిల్లా చోటే బెటియాపోలీసు స్టేషన్ పరిధిలోని మోర్ఖాండి గ్రామానికి చెందిన కుల్లె కట్లామి(35),మనోజ్ కవచి(22), దుగ్గే కవచి(27)లను నక్సలైట్లు

బుధవారం రాత్రి చంపేసినట్లు ప్రాథమిక సమాచారాన్ని ఉదహరిస్తూ పోలీసులు చెప్పారు. వీరు మహారాష్ట్ర పోలీసుకు చెందిన యాంటీ నక్సల్ యూనిట్ సి60కి ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారని సంఘటనా స్థలంలో వదిలేసిన కరపత్రాల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి తదుపరి వివరాలు అందాల్సి ఉందని ఆ ప్రకటన పేర్కొంది. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ గురువారం కాంకేర్ జిల్లాలో జరిగే ఎన్నికల ర్యాలీలో ప్రసంగించాల్సి ఉంది. చత్తీస్‌గఢ్‌లో ఈ నెల 7న జరిగే తొలి విడత అసెంబ్లీ ఎన్నిలక పోలింగ్‌లో భాంగా ఈ జిల్లాలో పోలింగ్ జరగాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News