Sunday, December 22, 2024

అంబర్‌పేటలో త్రిముఖ పోటీ

- Advertisement -
- Advertisement -

అభివృద్ధే అస్త్రంగా ప్రజల్లోకి బిఆర్‌ఎస్,  ఆరు గ్యారెంటీలతో బస్తీల్లోకి కాంగ్రెస్
కిషన్‌రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధే సోపానాలుగా బిజెపి ముందుకు

అంబర్‌పేట నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి నడుమ త్రిముఖ పోటీ నెలకొంది. దీంతో నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులో రాజకీయం ఊపందుకుంది. ఈమూడు పార్టీల అభ్యర్థులు స్థానికులకు సుపరిచితులు కావడంతో పోరు రసవత్తరంగా సాగనుంది. అభ్యుర్థులు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్‌లోని అన్ని బస్తిలు, కాలనీల్లో ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన అభ్యర్థు లు తమ తమ ప్రచార పర్వాన్ని ముమ్మరం చేస్తునే… అభ్యర్థులు ఇతర పార్టీల నేతలపై దృష్టి సారించి.. వారికి ఆయా పార్టీల కండువాలను మారుస్తున్నారు. గత వారం రోజుల నుంచి బిజెపి నుంచి బిఆర్‌ఎస్‌లోకి, బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగిస్తూ, అభ్యర్థులు గెలుపే లక్షంగా కొత్త వ్యూహా రచనలతో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

బిఆర్‌ఎస్ మేనిఫెస్టోపై హర్షం
అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ప్రచారంలో దూసుకుపోతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ మరోసారి గెలుపు వరిస్తుందనే నమ్మకంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2018లో ఎమ్మెల్యేగా గెలవగానే ప్రతి బస్తి, ప్రతి కాలనీలో గడపగ డపకు తిరుగుతూ సమస్యలు తెలుసుకున్నా, వాటికను గుణంగా ప్రణాళికలు రూపొందించి పరిష్కారానికి కృషి చేశానని అంటున్నారు. సీఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ సహకారంతో కోట్లాది రూపాయల నిధులు తీసుకవచ్చి నియోజకవర్గాన్ని అన్ని రంగాలల్లో అభివృద్ధి చేశా.. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశానని, ప్రచారంలో కాలేరు వెంకటేష్ ప్రజలకు వివరిసు ్తన్నారు. అదేవిధంగా మరో మాటు సంక్షేమ ఫలాలు అందుకున్న వారే తమను భారీ మెజార్టీతో గెలిపిస్తారని బిఆర్‌ఎస్ పార్టీ భావి స్తుందని, మేనిఫెస్టోను ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. బిఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోపై అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.

6 గ్యారంటీలతో బస్తీలోకి కాంగ్రెస్
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ అంబర్‌పేట ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్.సి.రోహిన్‌రెడ్డి… ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో ముందుకెళ్తున్నారు. నియో జకవర్గ ప్రజలతో తనకున్న అనుబంధంతో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ముఖ్య అను చరుడుకావడంతో యువత ఇతర వర్గాల ప్రజలతో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. బర్కత్‌పురలోని పుట్టి పెరగడంతో తనకున్న పరిచయాలు చిన్ననాటి స్నేహితులు కాంగ్రెస్ పార్టీ నేతలంతా ప్రచారానికి శ్రీకారంచుడతారని ప్రచారంలో ముందుకు సా గుతున్నారు.

కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జానారెడ్డి ఇటీవల నల్లకుంట డివిజన్‌లో రోహిన్‌రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపి వి.హనుమంతరావు అండదండలతో ఈ ఎన్నికల్లో గట్టెక్కగలనని తన నమ్మకం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజుల క్రితం బిఆర్‌ఎస్‌లో మంచి పట్టు ఉన్న నల్లకుంట మాజీ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవిరమేష్ దంపతులు, అంబర్‌పేట మాజీ కార్పొరేటర్ పులి జగన్, యువ నేత నగేష్ గౌడ్‌లు ఆ పార్టీకి రాజినామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

బిజెపి కంచుకోటగా అంబర్‌పేట
అంబర్‌పేట నియోజకవర్గం బిజెపికి బలమైనది. ఈ నియోజకవర్గం టికెట్‌ను మాజీ మంత్రి సి.కృష్ణయాదవ్‌కు బిజెపి పార్టీ తరపున టికెట్ కేయించారు. పూర్వ హిమయత్ నగర్ నియజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్‌గా, మంత్రిగా పనిచేసిన అనుభవం కృష్ణయాదవ్‌కు ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో కృష్ణ యాదవ్‌కు ఇవి కలిసొచ్చే అవకాశాలున్నారు. యాదవ సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో బలంగా ఉంది. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి సొంత నియోకవర్గం కావడంతో అందరి చూపు దీనిపైనే ఉంది. ఈ నియోజకవర్గంలో బిజెపికి ముగ్గురు కార్పొరేటర్లు ఉండగా వారిలో బాగ్ అంబర్‌పేట కార్పొరేటర్ బి. పద్మా, వెంకట్‌రెడ్డి బిఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణలో అవినీతి కుటుంబ పాలన కొనసాగుతుందని, గద్దె దించాలని మాజీ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి సి.కృష్ణ యాదవ్ ప్రచారంలో తెరపైకి తీసుకోస్తున్నారు.

(ఎం. పరశురాం/మనతెలంగాణ)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News