Sunday, December 22, 2024

ట్రాక్టర్ బోల్తా ముగ్గురు మహిళా కూలీలు మృతి

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ మండ మియాపూర్ గ్రామ శివారులో ఆదివారం మొక్కజొన్న కంకుల లో డుతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ బోల్తా పడిన ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మొక్కజొన్న కంకుల పొట్టు తీసేందుకు కూలి పని కోసం వెళ్లి తిరిగి అదే ట్రాక్టర్ కంకుల లోడు వస్తుండగా ఎస్‌ఆర్‌ఎస్‌పి ఉపకాల్వలో ట్రాక్టర్ బోల్తా పడింది.

ఈ ప్ర మాదంలో బేతి లక్ష్మి(46), మల్యాల వైష్ణవి (31), పోచంపల్లి రాజమ్మ (62) మృతి చెందారు. మృతులంగా చిన్న బొంకూరు గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు మహిళా కూలీలు పోచంపల్లి పద్మ, విజ్జగిరి రమ, విజ్జగిరి రాజమ్మ, కనుగుల సరితతో పాటు మరో మహిళా కూలీ గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన ట్రాక్టర్ నడిపిన మల్యాల వెంకటేష్ (40) అనే డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News