Sunday, January 19, 2025

కుటుంబ సభ్యుల ఎదుటే ముగ్గురు మహిళలపై లైంగిక దాడి

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్ : హర్యానా లోని పానిపట్ జిల్లాలో సాయుధులైన కొందరు దుండగులు ఒక ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యుల ఎదుటే ముగ్గురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డారు. నలుగురు దుండగులు కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టిపడేసి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆ తరువాత ఇంట్లోని డబ్బు, నగలు దోచుకున్నారు. బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. అదే గ్రామంలో మరో ఇంటిపై కూడా దాడి చేసినట్టు పోలీస్‌లు అనుమానిస్తున్నారు. ఒక వ్యక్తి నుంచి డబ్బులు, మొబైల్ ఫోన్ దోచుకున్నారు. ఈ సంఘటనలపై పోలీస్‌లు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News