చెన్నై: అల్లుడు వేధింపులు తట్టుకోలేక ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులోని విరుదునగర్ జిల్లా కార్యా పట్టి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ముని మయ్మాళ్ తన ఇద్దరు కుమారులు, కూతురు జయలలితతో కలిసి ముష్టికురిచ్చి గ్రామంలో నివసిస్తున్నారు. జయలలిత(18)ను తన సమీప బంధువు ముత్తుకుమార్‌కు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. జయలలితను పలుమార్లు ముత్తుకుమార్ వేధించాడు. అత్త మునియమ్మాళ్‌ను కూడా వేధించాడు. అత్తకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని పలుమార్లు చెప్పడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. దీంతో మునియమ్మాళ్ తన కూతురుతో కలిసి అమ్మగారింటికి అడైకలం(65) వద్దకు వచ్చింది. మంగళవారం వస్తానని డబ్బులు, బంగారం సిద్ధం చేయాలని అత్తకు హుకుం జారీ చేశాడు. అల్లుడు ఒత్తిడి తట్టుకోలేక అత్త, అత్త తల్లి, కూతురు విషం తాగి చనిపోయారు. ముత్తుకుమార్ తలుపు కొట్టిన తెరుచుకోకపోవడంతో స్థానికులు కిటికీలో నుంచి చూడగా ముగ్గురు మహిళల మృతదేహాలు కనిపించాయి. పోలీసులు వస్తున్నారనే సమాచారంతో ముత్తుకుమార్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. ఆవియార్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ముత్తుకుమార్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.