Friday, December 20, 2024

చికాగోలో కాల్పులు.. ముగ్గురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

Three wounded in shooting in Chicago

చికాగో: నగర శివార్లలోని సౌత్ ఆస్టిన్‌లో శుక్రవారం రాత్రి ఆగి ఉన్న కారుపై గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ముగ్గురు గాయపడ్డారు. రాత్రి 10.15 గంటల ప్రాంతంలో నిలిపిఉన్న కారులో కూర్చున్న ఒక వ్యక్తి డోరు పక్కన నిలబడి ఉన్న మహిళతో మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ కాల్పులలో కారులో ఉన్న 34 ఏళ్ల వ్యక్తికి మెడలో రెండు తూటాలు దూసుకెళ్లగా 31 ఏళ్ల ఆ మహిళ మోచేతికి తూటా తాకింది. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందచేస్తున్నారు. ఆ మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు చెప్పారు. అదే సమయంలో మరో కారులో వెళుతున్న ఒక 32 ఏళ్ల వ్యక్తిపై కూడా తూటా దూసుకెళ్లింది. ఆ వ్యక్తిని కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే అతని ఆరోగ్యం బాగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పులకు సంబంధించి ఎవరినైనా అరెస్టు చేసిందీ లేనిదీ పోలీసులు వెల్లడించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News