Wednesday, January 22, 2025

కృష్ణానదిలో ముగ్గురు యువకులు గల్లంతు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నాగార్జునసాగర్ : నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ఫైలాన్ కాలనీలోని విఐపి శివాలయం ఘాట్ వద్ద కృష్ణానదిలో గురువారం ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. శివాలయంలో మూడు రోజుల పాటు పూజా కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో నిర్వహిస్తున్నారు.

శుక్రవారం ఒడుగు కార్యక్రమంలో భాగంగా గురువారం సాయం త్రం శివాలయం ఘాట్ వద్ద స్నానానికి దిగువ యువకులు పవర్ హౌస్ టర్బైన్లు వదిలి పెట్టడంతో ఒక్కసారిగా నది ప్రవాహం పెరిగి ముగ్గురు గల్లంతయ్యారు. గల్లైంతైన వారిలో నాగార్జునసాగర్ ఫైలాన్ కాలానీకి చెందిన ఉప్పల చంద్రకాంత్ (26), హరి కీర్తి నాగరాజు (39), హర్షిత్ (26) ఉన్నారని పోలీసులు తెలిపారు. శివాలయం పుష్కర ఘాట్ వద్ద విషాదచాయలు అలుముకున్నాయి. పోలీస్‌లు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News