Wednesday, December 25, 2024

మణిరత్నం- కమల్ కాంబినేషన్ లో ‘థగ్ లైఫ్’

- Advertisement -
- Advertisement -

దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత మళ్ళీ మణిరత్నం- కమల్ హాసన్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతోంది. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి థగ్ లైఫ్ అని పేరు ఖరారు చేశారు. కమల్, త్రిష హీరో హీరోయిన్లు కాగా సపోర్టింగ్ కేరక్టర్స్ గా భారీ తారాగణాన్ని రంగంలోకి దించుతున్నారు. దుల్కర్ సల్మాన్, జయం రవిలతో పాటు హీరో గౌతమ్ కార్తీక్, జోజూ జార్జ్, ఐశ్వర్యలక్ష్మి కూడా ఇందులో నటిస్తున్నారు. కమల్-మణిరత్నం కలయికలో 37 ఏళ్ల క్రితం నాయకుడు సినిమా వచ్చింది. మళ్లీ తర్వాత ఇన్నాళ్లకు ఈ ఇద్దరూ చేతులు కలపడం కమల్ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది.

కమల్ కెరీర్ లో థగ్ లైఫ్ 234వ మూవీ అవుతుంది. ఈ మూవీకి ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం మరో విశేషం. ‘తెనాలి’ మూవీ తర్వాత కమల్ మూవీకి రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న సినిమా ఇదే. ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో కమల్, మణిరత్నం, ఆర్. మహేంద్రన్, శివ అనంత్ కలసి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News