Sunday, December 22, 2024

ఎడపల్లి శివారులో రౌడీషీటర్ హత్య…

- Advertisement -
- Advertisement -

ఎడపల్లి: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి శివారులో గురువారం దారుణం చోటుచేసుకుంది. ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. రౌడీ షీటర్ ఆరిఫ్ ఖాన్ ను గా గుర్తించారు. గుర్తుతెలియని దుండగులు ఆరిఫ్ ను కత్తులతో పొడిచి చంపినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో మరో వ్యక్తికి కాలికి గాయం అయింది. దీంతో బాధితుడిని బోధన్ ఆస్పత్రి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. రౌడీ షీటర్ బ్యాగ్రౌండ్, ఎవరు హత్య చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News