- Advertisement -
హైదరాబాద్: చివరి నిమిషంలో తనకు టికెట్ నిరాకరించడం పట్ల అసంతృప్తితో రగిలిపోతున్న వేములవాడ బిజెపి నేత తుల ఉమా సొంత పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. బిజెపి నాయకులెవరైనా తనకు ఫోన్ చేస్తే చెప్పుతో కొడతానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలలో తన అనుచరులతో సమావేశం అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పార్టీలో బిసిలను అణగ దొక్కాలనే ప్రయత్నం జరుగుతుందని దుయ్యబట్టారు. తన లాంటి వారిని మోసం చేయడానికి వారికి సిగ్గుండాలని, ఎవరో చెప్పిన గాలి మాటలు విని తననను రాజ కీయంగా బొందపెట్టాలని చూస్తున్నారని, తనతో మాట్లాడే ధైర్యం కూడా బిజెపి నాయకులకు లేదని ఫైర్ అయ్యారు. బిజెపిలో మహిళలకు స్థానం లేదని, నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానని అన్నారు.
- Advertisement -