Thursday, January 23, 2025

థమ్స్ అప్ ఒలింపిక్స్ ప్రచారం

- Advertisement -
- Advertisement -

న్యూదిల్లీ: కోకా-కోలా కంపెనీ ఆధ్వర్యంలోని దేశీయ బిలియన్-డాలర్ పానీయాల బ్రాండ్ అయిన థమ్స్ అప్, రాబోయే పారిస్ 2024 ఒలింపిక్, పారాలింపిక్ క్రీడలకు సంబంధించి తన కొత్త ప్రచార కార్యక్రమం ‘ఉఠా థమ్స్ అప్, జగా తూఫాన్’ని ప్రకటించడం పట్ల థ్రిల్‌గా ఉంది. ఈ ప్రచారం చూసేందుకు సాధారణ మైంది గానే కనిపిస్తుంది కానీ శక్తివంతమైన ఆలోచనపై ఆధారపడింది: అథ్లెట్లపై ‘ థమ్స్ అప్’ ప్రేరేపిత ప్రభావం వారు తమ అత్యుత్తమ ప్రదర్శనను అందించడానికి వారిని ప్రోత్సహిస్తుంది. మన అథ్లెట్లు డైనమిక్ ‘తూఫాన్లు’, వారు తమ అంతర్గత శక్తిని విశ్వసించేలా దేశాన్ని ప్రేరేపిస్తారు. కానీ ఒక ఛాంపియన్ రాత్రికి రాత్రి తయారు కారు. ప్రతిసారీ అథ్లెట్‌కు ఎదురుదెబ్బ తగిలినప్పుడు లేదా తడబడినట్లు అనిపించినప్పుడు, వారి మద్దతుదారులు, కోచ్, స్నేహితులు, కుటుంబ సభ్యుల నుండి అందే ఒక సాధారణ థమ్స్-అప్ వారికి విశ్వాసాన్ని తిరిగి పొందడంలో, విజయాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది – ఇదే కచ్చితంగా ఈ ప్రచార కార్యక్రమ సారాంశం.

అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలలో కోకా-కోలా కంపెనీ శాశ్వత భాగస్వామ్యంలో భాగంగా, థమ్స్ అప్ 2024 ఒలింపిక్ మరియు పారాలింపిక్ గేమ్‌లకు అధికారిక అంతర్జాతీయ భాగస్వామిగా కట్టుబడి ఉంది. ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిభను ప్రదర్శించే సంపూర్ణ అవయవ అథ్లెట్లు మరియు పారా-అథ్లెట్ల పట్టుదల, ధైర్యం, సంకల్పం కోసం థమ్స్ అప్ నిలకడగా, నిరంతర ఉత్సాహంతో ఉంది. సిఫ్ట్ కౌర్ సమ్రా, లవ్లీనా బొర్గొహైన్, నిఖత్ జరీన్, రుబీనా ఫ్రాన్సిస్, సాక్షి కసానాలతో కూడిన ఈ ప్రచార చిత్రం శక్తివంతమైన కథనాలు, దృశ్య మాన కథనాలను వివరిస్తుంది, అథ్లెట్లు థమ్స్ –అప్ శక్తిని తిరిగి పొందే నిజ జీవిత క్షణాలను ప్రదర్శిస్తుంది.

ఈ ప్రచార కార్యక్రమంపై సుమేలీ ఛటర్జీ వ్యాఖ్యానిస్తూ, స్పార్క్లింగ్ ఫ్లేవర్స్, కోకా-కోలా ఇండియా అండ్ సౌత్-వెస్ట్ ఏషియా సీనియర్ కేటగిరీ డైరెక్టర్, ‘‘భారతదేశ ఒలింపిక్స్, పారాలింపిక్స్ కలలో భాగమైనందుకు మేం సంతోషిస్తున్నాం. గత 4 సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రీడల్లో మన అథ్లెట్ల పవర్ ప్యాక్డ్ ప్రదర్శనలు మాకు అపారమైన గర్వాన్ని అందించాయి. పారిస్ 2024 ఒక చారిత్రాత్మక సందర్భం. వారి ప్రయాణంలో మా అథ్లెట్ల కు మద్దతు ఇవ్వడం మాకు గౌరవం. థమ్స్ -అప్ సాధారణ సంజ్ఞ ఏ క్షణాన్నైనా శక్తివంతమైన మలుపుగా మార్చగలదని మేం నిజంగా విశ్వసిస్తున్నాం – అథ్లెట్లకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికీ. ఐకానిక్ థమ్స్ అప్ బ్రాండ్‌తో జత చేయబడిన ఈ సంజ్ఞ, దృఢత్వం, అచంచలమైన సంకల్పం స్ఫూర్తిని ప్రతిబింబి స్తుంది’’ అని అన్నారు.

ఈ ప్రచార కార్యక్రమంతో తన అనుబంధం గురించి సిఫ్ట్ కౌర్ సమ్రా మాట్లాడుతూ, ‘‘ఈ ప్రచారంలో భాగమై నందుకు నేను ఎంతో గర్వంగా భావిస్తున్నాను. లెక్కలేనంత మంది వ్యక్తులు మనల్ని థమ్స్-అప్‌తో ప్రోత్స హిస్తున్నారని తెలుసుకోవడం ప్రపంచ వేదికపై మా అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి మాకు ధైర్యాన్ని ఇస్తుంది. ఇది మన దేశం నుండి మాకు లభించే మద్దతుకు నిదర్శనం’’ అని అన్నారు.

ఈ ప్రచార కార్యక్రమంతో తన అనుబంధం గురించి లోవ్లినా బోర్గోహైన్ మాట్లాడుతూ, ‘‘థమ్స్ అప్‌తో అను బంధం ఆనందంగా ఉంది. ఒక బాక్సర్‌గా, నేను ముఖ్యంగా కఠినమైన మ్యాచ్‌ల సమయంలో ప్రోత్సాహం విలువను అనుభవించాను. మద్దతు యొక్క ఒక సాధారణ సంజ్ఞ చాలా ప్రేరేపిస్తుంది, ఈ ప్రచారం నిజంగా దానిని నొక్కి చెబుతుంది’’ అని అన్నారు.

ఈ ప్రచార కార్యక్రమంతో తన అనుబంధం గురించి నిఖత్ జరీన్ వ్యాఖ్యానిస్తూ, ‘‘రింగ్‌లో, ప్రతి థమ్స్ అప్ కూడా కష్టపడి మరింత దూరం వెళ్లాలనే నా సంకల్పానికి ఆజ్యం పోసింది. ఒక బ్రాండ్‌గా థమ్స్ అప్‌ మా లాంటి క్రీడాకారులకు మద్దతు, నమ్మకం యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం చాలా గొప్ప విషయం’’ అని అన్నారు.

ఈ ప్రచార కార్యక్రమంతో తన అనుబంధం గురించి రుబీనా ఫ్రాన్సిస్ వ్యాఖ్యానిస్తూ, ‘‘థమ్స్ అప్ ప్రచారం తిరిగి కోలుకోవడాన్ని, ఐక్యతను రేకెత్తిస్తుంది. ఒక సాధారణ సంజ్ఞ మన ఉత్తమ షాట్‌ను అందించడానికి ఎలా ప్రేరేపిస్తుందో చూపిస్తుంది’’ అని అన్నారు.

ఈ ప్రచార కార్యక్రమంతో తనకున్న అనుబంధం గురించి సాక్షి కసానా వ్యాఖ్యానిస్తూ.. ‘‘అథ్లెట్‌లుగా, మద్దతు దారుల శక్తి మనకు బలమైన వ్యక్తిగా ఉండటానికి సహాయపడుతుంది. అనిశ్చితి క్షణాలలో, అభిమానులు మనలోని ఉత్తమమైన వాటిని ఆవిష్కరించగలరు. అన్ని కష్టాలకు వ్యతిరేకంగా మనం ఎదగగలిగేలా చేస్తారు’’ అని అన్నారు.

ఒగ్వి ఇండియా (నార్త్) చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ రీతు శారదా మాట్లాడుతూ, ‘‘ఒక థమ్స్ అప్‌లో గొప్ప శక్తి ఉంది. ఇది మీలో తుఫానును మేల్కొల్పగలదు. మీరు వదులుకోబోతున్నప్పుడు మిమ్మల్ని పైకి లేపుతుంది. ఇప్పుడు ఊహించండి, ఒక బిలియన్ థమ్స్ అప్ ఏమి చేయగలదో. ఈ ఒలింపిక్స్‌ లో, మేం మా అథ్లెట్లను బిలియన్ థమ్స్ అప్ శక్తితో దాడి చేసేందుకు పంపుతున్నాం. అదే ఈ కొత్త థమ్స్ అప్ ప్రచారంతో మేం సంగ్రహించాలనుకున్న భావోద్వేగం. ఉఠా థమ్స్ అప్, జగా తూఫాన్’’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News