Monday, December 23, 2024

పంట వేస్తేనే రైతు భరోసా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/గద్వాల ప్రతినిధి : రాష్ట్రంలో ఈసారి పంట వేసిన రైతులకే రైతు భరోసా అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలిపారు. గద్వాల జోగులాంబ జిల్లా, అలంపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన కార్యవర్గ ప్ర మాణ స్వీకారం సందర్భంగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మం త్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రేషన్ కార్డులేని రైతులు, రెండు లక్షల పైన రుణం ఉన్న రైతులు, సాంకేతికంగా పొరపాటు జ రిగి, ఇంతవరకు రుణం అందని రైతులకు, ఈ నెలాఖరులోపు రు ణమాఫీ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో 42 లక్షల మంది రైతుల రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేయడానికి ఇప్పటివరకు రూ.31 వేల కోట్లు వెచ్చించామని తెలిపారు. రైతును రాజు చేయడ మే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయమని అన్నారు. వ్యయసాయపరంగా, విద్యాపరంగా రాష్ట్రాన్ని ముం దుకు తీసుకుపోతున్నట్లు తెలిపారు.

తాను గతంలో నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన ఉందన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సస్యశ్యామలమైతే తెలంగాణ యావత్తు సస్యశ్యామలం అవుతుందని అన్నారు. కృష్ణ, తుంగభద్ర నదుల మధ్యన ఉన్న నడిగడ్డ ప్రాంతాన్ని ప్రత్యేకంగా అభివృద్ధ్ది చేయడానికి కృషి చేస్తామన్నారు. రైతన్నను, నేతన్నను రెండు కళ్లుగా చూసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేనేత కార్మికులకు రూ.30 కోట్లు మాఫీ చేసిందన్నారు. అకాల వర్షాల వల్ల ఖమ్మం జిల్లాలో అనేకమంది రైతులు నష్టపోయారని, రాష్ట్రంలో కూడా రైతులు నష్టపోయిన సమగ్ర నివేదిక తెప్పించి న్యాయం చేస్తామని అన్నారు. రైతులకు పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి ఆదుకుంటుందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా గద్వాల పత్తి విత్తనాలకు డిమాండ్ ఉన్నందున ముఖ్యమంత్రితో చర్చించి ఆర్గనైజర్లతో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. తుమ్మెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా మల్లమ్మకుంట రిజర్వాయర్‌ను త్వరగా నిర్మించేందుకు సిఎంతో చర్చించి పనులు పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. అయిజ వ్యవసాయ మార్కెట్ యార్డ్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రితో మాట్లాడి పరిహారం ఉద్యోగం అందేలా చూస్తామని అన్నారు. బీచుపల్లి ఆయిల్ మిల్లు ఉత్పాదకతకు మిషనరీలు, ఇతర ఏర్పాట్లు చేయించి వచ్చే సంవత్సరాంతం వరకు ప్రారంభించి ఇక్కడ నిరుద్యోగాన్ని రూపుమాపుతామని అన్నారు.

ఆయిల్ పామ్ తోటలు పెంచడం వల్ల ప్రతి రైతుకు ఎకరాకు రూ.1.50 లక్షల ఆదాయం లభిస్తుందని అన్నారు. రైతులు విరివిగా ఆయిల్ పామ్ తోటలను సాగు చేసి లబ్ధి పొందాలన్నారు. మారుతున్న కాలాన్ని బట్టి రైతులు నూతన సాంకేతిక పద్ధతులను అవలంబించి అధిక లాభాలు పొందాలన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. పాలమూరు జిల్లా వాసుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధిపథంలో నడిపిస్తారని తెలిపారు. అలంపూర్, అయిజ వ్యవసాయ మార్కెట్ యార్డుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, జిల్లా ఎస్‌పి శ్రీనివాసరావు, అలంపూర్ మాజీ ఎంఎల్‌ఎ సంపత్ కుమార్, కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బింగిదొడ్డి దొడ్డప్ప, వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ గౌడ్, డైరెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఆర్‌డిఓ రామచందర్, మార్కెటింగ్ ప్రాంతీయ ఉపసంచాలకుడు ప్రసాదరావు, జిల్లా మార్కెటింగ్ అధికారిణి పుష్పమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News