Sunday, December 22, 2024

త్వరలో రెండో విడత రుణమాఫీ

- Advertisement -
- Advertisement -

సాంకేతిక సమస్యలతో తొలి విడతలో 17,877 మంది ఖాతాల్లో జమ
కాని నిధులు ఆర్‌బిఐ సూచనల మేరకు త్వరలో వాటికి పరిష్కారం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మన తెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులకు రెండవ విడత పంట రుణమాఫీ సాధ్యమైనంత త్వరగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.రుణమాఫీ 2024లో మొద టి విడతగా రూ.లక్ష లోపు రుణాలకు సం బంధించి 11.50 లక్షల కుటుంబాలకు 6098.94 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. వీటిలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి అందిన సమాచారం మేరకు 11.32 లక్షల కుటుంబాలకు 6014 కోట్ల రూపాయలు జమ కావడం జరిగిందని వివరించారు.

కొన్ని సాంకేతిక కారణాలతో 17,877 ఖాతాలకు చెందిన 84.94 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో జమ కాలేదని తెలిపారు. రిజర్వ్‌బ్యాంక్ అధికారులు సూ చించిన వివరాల ప్రకారం అట్టి రైతుల ఖాతాలలో పేర్కొన్న సాంకేతిక సమస్యలను సరిచేసి, ఆర్‌బిఐ నుండి నిధులు వెనక్కి రాగానే తిరిగి ఆయా రైతుల ఖా తాలకు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వాణిజ్య బ్యాంకులకు అనుసంధానం చేయబడిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (సీడెడ్ సంఘాలు)కు సంబంధించి మిగిలిన కొన్ని రుణఖాతాల (15,781) తనిఖీ సోమవారం నాటితో పూర్తవుతుందని, పూర్తయిన వెంటనే ఆయా రైతుల బ్యాంకు ఖాతాలకు కూడా రుణమాఫీ నిధులు విడుదల చేయడం జరుగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News