హర్యానా: వాన పడుతుండగా తడవకుండా ఉండేందుకు చెట్టు కిందికి వెల్లిన నలుగురు వ్యక్తులు, అదే సమయంలో ఆకస్మాత్తుగా చెట్టుపై పిడుగు పడడంతో నలుగురు అక్కడికక్కడే కుప్పకూలి పోయారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సెక్టార్ 82 లోని సిగ్నేచర్ విల్లా వాటికా సిటీలో శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు వర్షం కురుస్తున్నది. శివదత్, రామ్ ప్రసాద్, లాలి, అనిల్ అనే నలుగురు తోట పనివాళ్లు ఆ సమయంలో అక్కడ పని చేస్తున్నారు. వాన పడుతుండటంతో ఆ నలుగురు ఒక చెట్టు కిందకు చేరారు. అయితే, ఉన్నట్టుండి ఆ చెట్టుపై పిడుగుపడింది. దీంతో ఆ నలుగురు పిడుగుపాటుకు కుప్పకూలి కిందపడిపోయారు. అక్కడి సిసిటివిలో ఇది రికార్డు అయ్యింది. ఆ నలుగురు చనిపోయి ఉంటారని అంతా భావించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వచ్చి పరిశీలించారు. కాలిన గాయాలతో పడి ఉన్న నలుగురిని వెంటనే రెండు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. కాగా, ముగ్గురికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ఒకరి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఐసియూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
Deadly Lightening in Gurgaon pic.twitter.com/nHygeNH3jX
— Sheela Bhatt शीला भट्ट (@sheela2010) March 12, 2021