Monday, December 23, 2024

ఉరుములు మెరుపులతో వర్షాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 24గంటల్లో అక్కడక్కడా ఉరుములు ,మెరుపులతో కూడి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ వాయువ్య దిశల నుండి తెలంగాణ రాష్ట్రంపైపునకు వీస్తున్నట్టు తెలిపింది.వీటి ప్రభావంతో రాగల మూడు రోజులు రాష్ట్రంలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.గడిచిన 24గంటల్లో రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జల్లా ములకల పల్లిలో 66.8 మి.మి వర్షం కురిసింది. గుబ్బగుర్తిలో 61.5, దుమ్ముగూడెంలో 43, వెంకటరావుపేటలో 28.3, తాడ్వాయ్‌లో 28.3, సుజాతానగర్‌లో 28జ3, కర్కగూడెంలో 25, కల్లెడలో 19.5,లక్ష్మీదేవిపేటలో 17, సిర్పూర్‌లో 15.8 మి.మి చోప్పున వర్షం కురిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News