Monday, January 20, 2025

రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో వర్షాలు

- Advertisement -
- Advertisement -

25నుంచి రుతుపవనాల నిష్క్రమణ

మనతెలంగాణ/హైదరాబాద్: రాగల రెండు రోజులు రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కిందిస్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాగల 48గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.మరోవైపు నైరుతి రుతుపవానాలు తిరోగమన బాట పట్టనున్నాయి.

నైరుతిలో లోటువర్షపాతం
నైరుతి రుతుపనాల సీజన్‌లో దేశమంతటా లోటు వర్షపాతం నెలకొంది. రుతుపవనాల ప్రభావం వల్ల దేశంలో సాధారణ సగటు వర్షపాతం 832.4 మిల్లీమీటర్లు నమోదు కావాల్సివుండగా , ఈ సారి 780.3 మి.మి మాత్రమే నమోదు జరిగింది. నైరుతి రుతువపనాలు కూడా ఈ నెల 25 తర్వాత వాయువ్య భారతదేశం నుంచి వెనక్కు మళ్లేఅవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.అక్టోబర్ 15నాటికి నైరుతి రుతుపవనాలు దేశం నుంచి పూర్తిగా నిష్క్రమించనున్నాయి. రానున్న ఐదు రోజుల్లో ఉత్తర , మధ్య భారతంలో వర్షాలు తగ్గిపోనున్నాయి. పశ్చిమ , రాజస్థాన్ నుంచి రుతుపవనాలు తిరోగమనానికి అనువుగా పరిస్థితులు మారుతున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News