Friday, December 20, 2024

తూప్రాన్ మహంకాళమ్మకు గొప్ప చరిత్ర

- Advertisement -
- Advertisement -
  • ఉజ్జయిని నుంచి విగ్రహం తెచ్చి ప్రతిష్ఠ
  • నేటి నుంచి బోనాల జాతర ఉత్సవాలు

తూప్రాన్: ఊరిని… ప్రజలను పాడి పంటలను చల్లంగా చూసే మహిమగల్ల తల్లిగా ప్రతి యేటా ఆషాడమాసంలో సబ్బండ కులాల ప్రజల చేత బోనాల పండగ జరుపుకుంటున్న తూప్రాన్‌లోని ఉజ్జయిని మహంకాళి అ మ్మవారికి గొప్ప చరిత్రనే ఉంది. సికింద్రాబాద్‌లోని ఉజ్జయి ని మహంకాళి మాత అంతటి గొప్ప విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. సుమారు తొమ్మిది దశాబ్దాల క్రితం తూప్రాన్ గుండా రోడ్డు నిర్మాణం పనులు చేపట్టిన ఓ కాంట్రాక్టర్ త నకు రోడ్డు పనుల్లో మంచి ఆదాయం వస్తే తూప్రాన్‌లో విగ్రహాన్ని నెలకొల్పుతానని అమ్మవారిని మొక్కుకున్నట్లు అనుకున్న కోర్కె నెరవేరడంతో అతను ఉజ్జయిని నుంచి మహంకాళి మాత విగ్రహాన్ని తెచ్చి తూప్రాన్‌లో ప్రతిష్టించి ఆల యం నిర్మించినట్లు స్థానిక ప్రజలు చెప్పుకుంటారు. అలా నెలకొల్పబడిన మహంకాళి ఆలయంతో పాటు గ్రామస్థుల చేత పోచమ్మ, ముత్యాలమ్మ, బ్రమరాంభిక మాత ఆలయా లు ఏర్పాటయ్యాయి.

గౌడ సంఘం వారిచే రేణుక ఎల్లమ్మ, నాగదేవత ఆలయాలు కూడా అక్కడ ఏర్పాటయ్యాయి. దీం తో ముఖ్యమైన గ్రామదేవతల ఆలయాలు ఒకే దగ్గర ప్రజల కు అందుబాటులో ఉండి యేటేట బోనాల పండగతో ప్ర త్యేక పూజలు అందుకుంటున్నారు. సికింద్రాబాద్ బోనా ల ఉత్సవాలు జరిగిన మరుసటి వారం మహంకాళి జాతర ఉత్సవాలు నిర్వహించడం తూప్రాన్‌లో ఆచారంగా వస్తుం ది. ఈసారి బోనాల పండగనుపెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్మన్ రవీందర్‌గౌడ్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జాతర ఉత్సవా లు జరిపేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహంకాళి ఆలయాన్ని రంగులతో, సీరియల్ బల్బులతో, అద్బుతంగా తీర్చిదిద్దారు. అలాగే మెయిన్ రోడ్డుపై డివైడర్ పొడుగున సీరియల్ బల్బులను అమర్చి ప్రత్యేక ఆకర్షణ వచ్చేలా తీర్చిదిద్దారు.

మూడు రోజులపాటు జాతర ఉత్సవాలు జరగనున్నాయి. మొదటి రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం నుంచి బోనాల ఊరేగింపులు ఉంటాయి. మొదట గౌడ కులస్థుల కల్లు ఘటం ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సాక పెట్టిన తర్వాత నుంచి వివిధ కులాల వారు తమ కుల సంప్రదాయం ప్రకారం బో నాల ఊరేగింపు నిర్వహిస్తారు. సోమవారం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, గావురంగాలు ఉత్సవాఉల జరుగుతాయి. మంగళవారం భ్రమరాంబిక మాతకు ప్రత్యేక పూజలు, ఒగ్గుకథ తదితర కార్యక్రమాలు కొనసాగుతాయి. బోనాల పండగ సందర్భంగా పలువురు అధికార పార్టీ నాయకులు పోటాపోటీగా పట్టణంలో ప్లెక్సీలను ఏర్పాటు చేశారు.

మరోవైపు పలు యూత్ కమిటీల వారు, యువకులు అమ్మవారికి ఫలహారం సమర్పించడం తొట్టెల ఊరేగింపులు జరపడానికి ఎవరికి వారుగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ సికింద్రాబాద్‌లో జరిగే ఉత్సవాలకు ఏమాత్రం తీసిపోకుండా యువకులు తొట్టెల ఊరేగింపులు నిర్వహిస్తారు. తూప్రాన్‌లో బోనాల జాతర, తొట్టెల ఊరేగింపులను చూసేందుకు ఇతర చోట్ల నుంచి జనాలు రావడం ఇక్కడి ఉత్సవాల ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇతర ప్రాంతాల నుంచి బ్యాండ్‌వాళ్లను, డప్పు కళాకారులను,బోనం ఎత్తుకోవడానికి మహిళా కళాకారులను పిలిపించి భారీ ఊరేగింపులు నిర్వహిస్తారు. యువకులు గత వారం రోజుల ముందు నుంచే తొట్టెల ఊరేగింపు ఉత్సవాల నిర్వహణకు సిద్దమై ప్రయత్నాలు చేస్తున్నారు. బోనాల ఊరేగింపులు సైతం శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో యువకుల నృత్యాలతో జబర్దస్త్‌గా జరుగుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News