Monday, January 20, 2025

పల్లెటూరు రివెంజ్ కామెడీ జోనర్‌లో…

- Advertisement -
- Advertisement -

తెలంగాణ పల్లె కథతో వస్తున్న సినిమా ‘తురుమ్ ఖాన్‌లు’. ‘స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ‘ బ్యానర్‌పై ఎండీ. ఆసిఫ్ జానీ నిర్మాతగా, శివకళ్యాణ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం శంషాబాద్‌లో జరిగిన ఆఖరి షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తి చేసుకుంది. పల్లెటూరు రివెంజ్ కామెడీ జోనర్‌లో మొదటి సారి మహబూబ్‌నగర్ యాసలో తెరకెక్కెక్కించిన ఈ చిత్రంలో దాదాపు 90 శాతం కొత్త నటీనటులే నటించారు.

చిత్ర దర్శకుడు శివకళ్యాణ్ మాట్లాడుతూ… బ్రహ్మ, విష్ణు, ఈశ్వర్ అనే ముగ్గురు యువకులు ఒకే ఊరిలో పుట్టీపెరిగీ సరదాగా ఒకరినొకరు ఎలా ఆటపట్టించుకుంటారు అనే నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుంది. ఒకర్ని ఒకరు ఎలా ఏడిపించుకుంటారు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ఇది అని అన్నారు. నిర్మాత ఆసిఫ్ జానీ మాట్లాడుతూ… బలమైన కథ, సహజమైన పాత్రలతో తెరకెక్కిన ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News