Thursday, January 23, 2025

ట్యాంక్ బండ్ పై ఘనంగా త్యాగరాజస్వామి జయంతి ఉత్సవం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నాదోపాసనతో భగవంతుని చేరుకోవచ్చని నిరూపించిన వాగ్గేయకారుడు త్యాగరాజని తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. సద్గురు శ్రీ త్యాగరాజస్వామి 256వ జయంతి ఉత్సవములు హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పైన శ్రీ త్యాగరాజస్వామి విగ్రహం వద్ద బుధవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమంలోముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. తెలుగు నేలపై పుట్టిన త్యాగరాజు కర్నాటక శాస్త్రీయ సంగీత సామ్రాజ్యాన్ని అధిరోహించడం తెలుగువారికి గర్వకారణమన్నారు. త్యాగరాజస్వామి కీర్తనలకు బహుళ ప్రచారం కల్పించడానికి తెలంగాణ సాహిత్య అకాడమీ కృషి చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో సరస్వతి ఉపాసకులు దైవజ్ఞశర్మ మాట్లాడుతూ తెలుగువాడైనప్పటికీ తమిళనాడులో కీర్తించబడుతున్న, పూజించబడుతున్న, సంగీతంతో దైవాన్ని సాక్షాత్కరింపజేసుకున్న సంగీతోపాసకుడు త్యాగబ్రహ్మ అని కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో హరిహర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మారడాని శ్రీనివాసరావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రముఖ తెలుగు వాగ్గేయకారులైన రామదాసు, తాళ్లపాక అన్నమయ్య, త్యాగరాజస్వామి జయంతి ఉత్సవాలను ట్యాంక్ బండ్ పై వారి విగ్రహాల వద్ద ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అశ్విన్, నరసింహ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News