Friday, November 22, 2024

చైనా ప్రాతినిధ్యంపై టిబెటియన్ల నిరసనలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జి 20 సదస్సుకు ఈసారి చైనా అధ్యక్షులు జిన్‌పింగ్ రావడం లేదు. అయితే చైనా తరఫున అధికారిక ప్రతినిధి బృందం దేశ ప్రధాని సారధ్యంలో హాజరవుతోంది. చైనా ప్రతినిధి బృందం జి 20 సమ్మిట్‌కు రావడంపై స్థానిక నార్త్ ఢిల్లీలోని మజ్ను కా టిల్లా వద్ద శుక్రవారం టిబెటియన్లు నిరసనలు చేపట్టారు. చేతుల్లో బ్యానర్లు పట్టుకుని చైనా వ్యతిరేక నినాదాలకు దిగారు. దీనితో ఈ ప్రాంతంలో కొంత సేపు సందడి నెలకొంది.

భారీ భద్రతా ఏర్పాట్ల ఢిల్లీలో టిబెటియన్లు శాంతియుత ప్రదర్శనలు చేశారు. స్వేచ్ఛాయుత టిబెట్ నినాదాలు మిన్నంటాయి. తమ నిరసనలు భారతదేశానికి వ్యతిరేకంగా కావని, ఇక్కడ జి 20 సదస్సు నిర్వహణను తాము వ్యతిరేకించడం లేదని, అయితే జి 20 సమ్మిట్‌కు చైనా ప్రతినిధి బృందం ఆగమనాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని టిబెట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గొన్పో ధండప్ తెలిపారు. జి 20 సదస్సు భారత దేశ ఆతిధ్యంలో నిర్వహించడం తమకు గర్వకారణం అని టిబెటియన్లు చెప్పారు. మజ్ను కా టిక్కా టిబెటియన్ల పునరావాస కేంద్రంగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News