Monday, December 23, 2024

భద్రాద్రి సీతారాముడి కళ్యాణానికి ఆన్‌లైన్‌లో టిక్కెట్లు

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా వెల్లడి

మన తెలంగాణ / హైదరాబాద్ : భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం , పట్టాభిషేకం తిలకించడానికి వచ్చే వివిఐపి, వీఐపీలు, ఉభయ దాతలు, సామాన్య భక్తులకు టికెట్ల వివరాలు అలాగే వసతి కోసం గదులను కూడా ఆన్ లైన్ లో ఉంచామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా తెలిపారు. టిక్కెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఉభయ దాతల టికెట్లు- రూ. 7,500, వివిఐపి టికెట్లు రూ. 2,500, విఐపి టికెట్లు రూ. 2,000, సామాన్య భక్తులకు 1,000 నుండి రూ. 300, అలాగే రూ. 150 -రేట్ల ప్రకారం అందుబాటులో ఉంచామని దానికి సంబంధించిన వెబ్ సైట్ భద్రాద్రి టెంపుల్ డాట్ తెలంగాణ డాట్ జీఓవీ డాట్ ఇన్ https://bhadradritemple.telangana.gov.in ద్వారా టికెట్లు పొందవచ్చని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News