- Advertisement -
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్‌ఆర్టీసీ) సత్తా చాటుతోంది. తాజాగా ప్రయాణికులకు మరో సులభతర వెసులుబాటును కల్పిస్తూ ఆర్టీసీ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో డిజిటల్ చెల్లింపులతో టికెట్లను విక్రయించేందుకు ఆ సంస్థ తీర్మానించింది. బస్సులో టికెట్కు చెల్లించాల్సిన సొమ్మును ప్రయాణికులు యూపిఐ పేమెంట్ల ద్వారా చెల్లించేలా ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ కొత్త తరహా వెసులుబాటును తొలుత విశాఖ నుంచి నడిచే 97 సర్వీసుల్లో అందుబాటులోకి తీసుకురానుంది. దశల వారీగా అన్ని బస్సుల్లోనూ యూపిఐ చెల్లింపులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎపిఎస్ ఆర్టీసీ తెలిపింది.
- Advertisement -