Monday, December 23, 2024

అమరావతిలో పేదలకు “పట్టా”భిషేకం

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతిలో సిఎం జగన్ మోహన్ రెడ్డి సరికొత్త చరిత్ర సృష్టించాడు. వెంకటపాలెంలో పేదలకు ఇళ్ల పట్టాలు సిఎం జగన్ అందజేయనున్నారు. సిఆర్‌డిఎ పరిధిలో 50,793 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. సిఆర్‌డిఎ పరిధిలో 1402.58 ఎకరాల్లో 25 లేఅవుట్లు సిద్ధంగా ఉన్నాయి. 23,762 మంది గుంటూరు జిల్లా అక్కచెల్లెమ్మలకు 11 లే అవుట్లు ఉన్నాయి, 27031 మంది ఎన్‌టిఆర్ జిల్లా అక్క చెల్లెమ్మలకు 14 లేఅవుట్లు ఉన్నాయి, 232 కిలో మీటర్ల పొడవున గ్రావెల్‌తో అంతర్గత రవాణా వ్యవస్థ నిర్మాణం చేపడుతున్నారు. ఇళ్ల స్థలాలతో పాటు వైఎస్‌ఆర్ జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టనున్నారు. రెండు వేల కోట్ల రూపాయలతో వైఎస్‌ఆర్ జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టనున్నారు. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకంలో నిరుపేదలకు స్థలాలు అని, సిఆర్‌డిఎ ప్రాంతంలో రూ.443.71 కోట్లుతో 5204 టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టానున్నారు.

Also Read: మురికివాడ నుంచి మోడల్‌గా ఎదిగిన చిన్నారి

ఇదే వేదికపై 5204 టిడ్కో ఇళ్లను సిఎం జగన్ పంపిణీ చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 2.62 లక్షల టిడ్కో లబ్ధిదారులకు రూ.14,514 కోట్ల సబ్సిడీ ఇవ్వనున్నారు. అబ్ధిదారులు చెల్లించాల్సిన ముందస్తు వాటా సొమ్ములో 50 శాతం రాయితీ ప్రభుత్వం ఇవ్వనుంది. టిడ్కో ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్లు… ఒక్కో లబ్ధిదారుడికి రూ.60 వేల లబ్ధి చేకూరనుంది. టిడ్కో ఇళ్ల ద్వారా పేద అక్కచెల్లెమ్మలకు రూ.18714 కోట్ల లబ్ధి చేకూరనుంది. గతం ప్రభుత్వంలో ఇదే ఇంటికి రూ.7.20 లక్షలు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీని హర్షిస్తూ ఎపి ప్రజలు భారీ ర్యాలీలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో సిఎం జగన్, వైఎస్‌ఆర్ చిత్రపటాలకు అభిమానులు, ప్రజలు క్షీరాభిషేకాలు చేశారు. ఎపి వ్యాప్తంగా సుమారుగా 30 లక్షల 60 వేల ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. అక్కచెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల నుంచి 15 లక్షల వరకు లబ్ధి చేకూరనుంది. అక్కచెల్లెమ్మల చేతుల్లో రూ. రెండు లక్షల కోట్ల నుంచి మూడు లక్షల కోట్ల సంపద ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News