Monday, January 20, 2025

వనభోజనాన్ని తలపించేలా ‘టిఫిన్ బైఠక్’

- Advertisement -
- Advertisement -

మౌలాలి: మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో బిజేపి రాష్ట్ర పార్టీ అదేశాల మేరకు బిజేపి నాయకులు ‘టిఫిన్ బైఠక్’ కార్యక్రమం వన భోజన మహోత్సవ సందడిగా నిర్వహించారు. బిజేపి మల్కాజిగిరి అసెంబ్లీ కన్వీనర్ సదానంద్‌గౌడ్ ఆధ్వర్యంలో శనివారం సఫిల్‌గూడ మినీ ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ రాంచందర్, మల్కాజిగిరి, వినాయక్‌నగర్ డివిజన్‌ల కార్పొరేటర్లు శ్రవణ్ కుమార్, క్యానం రాజ్యలక్ష్మీ, బిజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కె. భానుప్రకాశ్‌తో పాటు పలువురు నాయకులు హజరయ్యారు. ఈ సందర్భంగా ఎవరి టిఫెన్ వాళ్లే తెచ్చుకొని రుచి చూశారు.

రాజకీయాలు ఏమీ మాట్లాడకుండా రోటిన్‌కు భిన్నంగా అందరూ కలిసి ఆహ్లదకరమైన వాతావరణంలో కులాసా కబుర్లతో పరస్పరం యోగ క్షేమాలు తెలుసుకుని ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌నేత వడ్డి సుబ్బారావు, బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాసం శెట్టి శ్రీనివాస్, ఓబీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంతోష్‌కుమార్, ఓబీసీ సెల్ సూర్యపేట జిల్లా ఇన్‌ఛార్జి గున్నాల లక్ష్మణ్‌గౌడ్, మల్కాజిగిరి ఓబీసీ ఛైర్మన్ చింతకుంట విఠోభా, బిజేపి మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యుడు సింగం లింగరావు, మల్కాజిగిరి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, వినాయక్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News