Wednesday, January 22, 2025

పులికి సీత పేరు.. కోర్టుకెక్కిన విహెచ్ పీ!

- Advertisement -
- Advertisement -

బెంగాల్ సఫారీ పార్కులో ఉన్న ఓ ఆడపులికి సీత అని పేరు పెట్టడం పట్ల విశ్వహిందూ పరిషత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాదు, దీనిపై కోల్ కతా హైకోర్టులో కేసు వేసింది. అయితే హిందూ పురాణమైన రామాయణంలోని సీత పేరును ఓ పులికి పెట్టడం ద్వారా హిందూ మతాన్ని అవమానిస్తున్నారంటూ విహెచ్ పి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఓ పులికి సీతామాత పేరు పెట్టడం హిందూమతంపై జరుపుతున్న దాడిగా జిల్లా విహెచ్ పి అధ్యక్షుడు దులాల్ చంద్ర రే ఆరోపించారు.

జంతువుల మార్పిడి పథకంలో భాగంగా త్రిపురలోని సెపహిజాలా జూలాజికల్ పార్కులో ఉన్న అక్బర్, సీత అనే పేర్లున్న మగ, ఆడ పులులను సిలిగురిలో ఉన్న బెంగాల్ సఫారీ పార్క్ కు ఇటీవలే తీసుకువచ్చారు. ఈ పులులను బెంగాల్ కు తీసుకొచ్చాకే వాటికి అక్బర్, సీత అనే పేర్లు పెట్టారని విహెచ్ పి తరఫు న్యాయవాది శుభాంకర్ దత్తా ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను బెంగాల్ సఫారీ పార్క్ అధికారులు ఖండించారు. తమ జూకు వాటిని తీసుకురావడానికి ముందే పులులకు ఆ పేర్లు పెట్టారని వారు వివరించారు. ఈ రెండు పులులూ సెపహిజాలా జూలోనే పుట్టాయి.

దీనిపై విశ్వహిందూ పరిషత్ కు చెందిన అనూప్ కుమార్ మోండల్, లక్ష్మణ్ కుమార్ గర్వాల్ అనే కార్యకర్తలు కోర్టులో కేసు వేశారు. ఈ కేసు 20న విచారణకు రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News