ఇండియన్ సినిమా హిస్టరీలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటకు స్పెషల్ క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు వారిద్దరూ కలిసి నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అలాగే ఆ సినిమాల్లో పాటలు చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. తాజాగా వీరి జంట మరోసారి ‘టైగర్ 3’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమయ్యారు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ స్పై థ్రిల్లర్‌లో టైగర్ పాత్రలో సల్మాన్ ఖాన్, జోయా పాత్రలో కత్రినా కైఫ్ నటిస్తున్నారు.
‘టైగర్ 3’ చిత్రానికి మాస్ ఇమేజ్, క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈ ఏడాది విడుదలవుతున్న చిత్రాల్లో ‘టైగర్ 3’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వైఆర్ఎఫ్ నిర్మాణ సంస్థ రూపొందించిన ఈ సినిమా నుంచి ఇప్పుడు తొలి పాట ‘లేకే ప్రభు కా నామ్..’ను మేకర్స్ విడుదల చేస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఈ పాట ఇంటర్నెట్‌లో వైరల్ కావటానికి సన్నద్ధమైంది. ఇప్పటికే విడుదలైన ఈ సాంగ్ టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ‘‘నేను, కత్రినా కైఫ్ కలిసి నటించిన సినిమాల్లో ప్రేక్షకులను అలరించిన పాటలెన్నో ఉన్నాయి. మా సినిమా వస్తుందంటే ఎలాంటి అంచనాలుంటాయో నాకు తెలుసు. అందులో ఓ పాట ఆకాశమే హద్దు అనేలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అదే కోవలో టైగర్ 3 చిత్రం నుంచి లేకే ప్రభు కా నామ్ పాట ప్రేక్షకులను మెప్పిస్తుంది. నాకు వ్యక్తిగతంగానూ ఈ డాన్సింగ్ సాంగ్ ఎంతో ఇష్టమైనది. నా కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సింగ్ ట్రాక్ సాంగ్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా అభిమానులను, సినీ ప్రేమికులను మెప్పించి చార్ట్ బస్టర్‌గా నిలుస్తుందనటంలో సందేహం లేదు’’ అన్నారు.
రీసెంట్‌గా విడుదలైన లేకే ప్రభు కా నామ్ సాంగ్ టీజర్‌లో సల్మాన్, కత్రినా మధ్య ఉన్న బ్యూటీఫుల్ కెమిస్ట్రీ ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేసింది. ప్రీతమ్ స్వరపరిచిన ఈ పాటకు అమితాబ్ భట్టాచార్య లిరిక్స్ అందించారు. బెన్ని దయాల్, అనుషా మని ఈ పాటను పాడారు. ఈ ఫెస్టివల్ సీజన్‌లో ఇదొక టాప్ పార్టీ సాంగ్‌గా నిలవనుంది. మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న టైగర్ 3 చిత్రాన్ని దీపావళి సందర్బంగా నవంబర్ 12 ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.