- Advertisement -
సల్లూభాయ్ సినిమాలా, మజాకానా? తాజాగా రిలీజైన టైగర్ 3 వసూళ్లను చూస్తే ఎవరైనా ముక్కు మీద వేలేసుకోవలసిందే. ఈ నెల 12న రిలీజైన ఈ సినిమా, వసూళ్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రపంచ కప్ ఫైనల్ జరిగిన ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో కలెక్షన్లు దుమ్ము రేపాయి.
ఆదిత్య చోప్రా నిర్మాతగా, మనీశ్ శర్మ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్స్మ్ రూపొందించిన టైగర్ 3 ఎనిమిది రోజుల్లో ఇండియాలో దాదాపు 230 కోట్ల రూపాయలు వసూలు చేసిందట. ప్రపంచవ్యాప్తంగా 376 కోట్లు (45.3 మిలియన్ డాలర్లు) రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. ప్రపంచ కప్ క్రికెట్ పైనల్ జరిగిన ఆదివారం మాత్రం వసూళ్లు కాస్త మందగించాయి. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చేసిన వసూళ్లు 19 కోట్లు మాత్రమే.
- Advertisement -