Thursday, February 13, 2025

కాగజ్‌నగర్‌లో పులి దాడి…. యువతి మృతి

- Advertisement -
- Advertisement -

కాగజ్‌నగర్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి దాడి చేయడంతో యువతి మృతి చెందింది. కాగజ్‌నగర్ మండలం గన్నారం గ్రామ శివారులో మోర్లె లక్ష్మి అనే యువతిపై పులి దాడి చేయడంతో మృతి చెందింది. యువతిని శరీర భాగాలను పులి పీక్కు తిన్నది. మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పులి దాడిలో యువతి చనిపోయిందిని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పులి అతి త్వరంలో పట్టుకుంటామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఒంటరిగా అడవిలో వెళ్లవద్దని అధికారులు స్థానికులకు తెలియజేశారు. పులుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కాగజ్‌నగర్‌లోని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News