Sunday, January 5, 2025

మరో రైతుపై పులి దాడి.. ఆస్పత్రికి తరలింపు

- Advertisement -
- Advertisement -

కుమురం భీం జిల్లా ప్రజలను పెద్ద పులి వణికిస్తోంది. ఎప్పుడు.. ఎక్కడి నుంచి వస్తుందోనని ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. గత రెండు మూడు రోజులుగా జిల్లాలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో శుక్రవారం ఉదయం ఓ యువతిపై పులి దాడి చేసి చంపింది. తాజాగా మరో రైతుపై పులి దాడి చేసింది. శనివారం సిర్పూర్‌.టి మండలంలోని దుబ్బగూడలో పొలంలో పనిచేస్తున్న సురేశ్‌ అనే రైతుపై పులి అటాక్ చేసింది. పెద్ద పులి దాడిలో తీవ్రంగా గాయపడిన రైతును వెంటనే గ్రామస్థులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అటవీశాక అధికారులు వెంటనే రంగంలోకి దిగి పులిని పట్టుకునేందుకు ప్రత్నిస్తున్నారు. పులి ఆచూకీ కోసం డ్రోన్ కెమెరాతో గాలింపు చర్యలు చేపట్టారు.

కాగా, శుక్రవారం కాగజ్ నగర్ మండలంలోని గన్నారంలో పత్తి చేనులో పనిచేస్తున్న 21ఏళ్ల యువతిపై పెద్దపులి అటాక్ చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయింది. ఒకరోజులోనే మరోసారి పులిన దాడిచేయడంతో ప్రజలు పొలం పనులకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News