Friday, December 20, 2024

తూర్పు గోదావరిలో పెద్దపులి సంచారం

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం కరగపాడులో పెద్దపులి సంచరిస్తోంది. మామిడితోటలో పులి గాండ్రింపులు విన్న రైతులు బయటకు పరుగులు పెట్టారు. పోలాల్లో పెద్దపులి అడవిపందిని చంపినట్లు రైతులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రైతుల సమాచారంతో ఘటాస్థలికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పెద్దపులి కోసం గాలిస్తున్నారు. జనాలు ఒంటరిగా తిరగవద్దని అధికారులు ప్రజలను హెచ్చరించారు. పెద్దపులిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని చెబున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News