Thursday, January 23, 2025

ఆదిలాబాద్‌లో పులి సంచారం

- Advertisement -
- Advertisement -

Tiger migration in Adilabad district

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఆదిలాబాద్‌లోని భీంపూర్ మండలం పిప్పల్‌కోటి రిజర్వియర్ సమీపంలో జేసీబీ డ్రైవర్ పులిని చూశాడు. ఆ ప్రాంతంలో పులుల సంచారంపై గ్రామస్తులకు సమాచారం అందించి వారిని అప్రమత్తం చేశాడు. గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా పులి గుర్తులను గుర్తించారు. కొద్ది రోజుల క్రితం ఇంద్రవెల్లి మండలంలో పులి కనిపించిందని, వెంటనే పట్టుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. దీంతో తక్షణమే చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News