Thursday, January 23, 2025

‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమా షురూ

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం శనివారం ఉగాది పర్వదినాన హైదరాబాద్‌లో ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం హీరో రవితేజ, హీరోయిన్లు నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు ముఖ్య అతిథి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టగా కెమెరా స్విచ్చాన్ తేజ్ నారాయణ అగర్వాల్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్క్రిప్ట్‌ని అందజేశారు. కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి గౌరవ దర్శకత్వం వహించారు. టైగర్ నాగేశ్వరరావు ప్రీలుక్ మోషన్ పోస్టర్‌ను చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. “టైగర్ నాగేశ్వరరావు కథను కరోనా సమయంలో దర్శకుడు వంశీ నాకు వినిపించాడు. చాలా అద్భుతంగా కథ చెప్పాడు. ఆతర్వాత నాకు సాధ్య పడలేదు. ఇప్పుడు నా తమ్ముడు రవితేజ ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా వుంది”అని అన్నారు. చిత్ర దర్శకుడు వంశీ మాట్లాడుతూ “రవితేజ ఈ సినిమా చేయడానికి ఒప్పుకొని మాకు ఎంతో ఎనర్జీ ఇచ్చారు. రవితేజ ఫ్యాన్సే కాదు తెలుగు హీరోల ఫ్యాన్స్ కూడా మెచ్చే చిత్రమిదవుతుందని హామీ ఇస్తున్నాను”అని తెలిపారు. ఈ వేడుకలో చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్, నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణుదేశాయ్ తదితరులు పాల్గొన్నారు. రేణుదేశాయ్, మురళీశర్మ, షణ్ముఖి ప్రధాన పాత్రల్లో నటించే ఈ చిత్రానికి కెమెరామెన్ ః ఆర్.మది, సంగీత దర్శకుడు ః జివి ప్రకాష్ కుమార్, డైలాగ్స్‌ః శ్రీకాంత్ విస్సా.

TIGER Nageswara Rao Movie Launch

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News