Wednesday, January 22, 2025

అక్టోబర్ 20 నుంచి టైగర్ వేట

- Advertisement -
- Advertisement -

పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్‌లను అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్ మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్‌లో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’తో వస్తోంది. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరాకు అక్టోబర్ 20న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే సినిమా ఆలస్యమయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ నేపధ్యంలో టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదలలో ఎలాంటి జాప్యం లేదని స్పష్టం చేస్తూ మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. “టైగర్‌నాగేశ్వరరావు మూవీ అక్టోబర్ 20న విడుదల కావడం లేదని నిరాధారమైన ఊహాగానాలు వచ్చాయి. కొన్ని శక్తులు ఈ రూమర్స్‌ని వ్యాప్తి చేస్తున్నాయి. ఎందుకంటే మా చిత్రం ప్రేక్షకుల నుంచి గొప్ప ఆసక్తిని సంపాదించింది. అక్టోబరు 20 నుంచి బాక్సాఆఫీస్ వద్ద టైగర్ వేట ప్రారంభమవుతుంది” అని మేకర్స్ తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News