Wednesday, January 22, 2025

పొలంలో పెద్దపులి కలకలం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో పెద్దపులి కనిపించడం కలకలం రేపింది. నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ మండలం మంగళవారం రైతులు పొలాలు దున్నుతుండగా పెద్దపులి కనిపించింది. దీంతో వారు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు పెద్దపులి సంచారం చేసిన ప్రదేశంలో పర్యటించారు. జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News