- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి కనిపించింది. పులి కనిపించగానే జీపులో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. గ్రామ రోడ్డు చివరలో జీపులో వెళ్తుండగా పెద్దపులి కనిపించడంతో ప్రయాణికులకు వెన్నులో వణుకుపుట్టింది. కాసేపు రోడ్డుపై పులి అటు ఇటు తిరుగుతూ అడవిలోకి వెళ్ళిపోయింది. వాహనదారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పులిని పట్టుకొని తమకు రక్షణ కల్పించాలని ఆత్మకూరు మండల పరిధిలో గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో 126వ నెంబరు గల పులి అని అటవీ శాఖ అధికారులు గుర్తించారు.
Video Player
00:00
00:00
- Advertisement -