- Advertisement -
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, సిర్పూర్ టి మండల, ఇటుకల పహాడ్ చిల్లపెళ్లి అటవీ ప్రాంతంలో బుధవారం మళ్లీ పులి సంచరించింది. బుధవారం మధ్యాహ్నం మకోడి రైలు పట్టాల వెంట పులి కనిపించడంతో రైల్లో ప్రయాణించే కొందరు వీడియోలు, ఫొటోలు తీశారు. ఆ సమాచారాన్ని సిర్పూర్ టి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. మధ్యాహ్నం సమయంలో మకుడి రైల్వే పట్టాల వెంట పులి సంచరించడంతో కొందరు ప్రయాణికులు చూశారు. ఇదే విషయాన్ని ఫారెస్ట్ అధికారి ఎగ్బాల్ ధృవీకరించారు. ఇటుకలపాడు చిల్లపల్లి అడవి ప్రాంతంలో మళ్లీ పులి సంచరిస్తున్నట్లు తెలిపారు. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
- Advertisement -