Monday, November 18, 2024

పాకాల అడవిలో పెద్దపులి అలజడి..

- Advertisement -
- Advertisement -

పాకాల అడవిలో పెద్దపులి అలజడి..
కాలి గుర్తులను పరిశీలించిన అటవీ అధికారులు
పులి సంచరిస్తుందని జిల్లా అటవీ అధికారుల నిర్ధారణ

Tiger wandering in Pakala Forest

మన తెలంగాణ/ఖానాపురం: వరంగల్ జిల్లా పాకాల అభయారణ్యంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు, జాగ్రత్తగా ఉండాలని వరంగల్ జిల్లా అటవీ అధికారులు తెలిపారు. పాకాల అభయారణ్యంలో సంచరిస్తున్న పెద్ద పులి సమాచారంతో మంగళవారం నర్సంపేట రేంజ్ సిబ్బంది ఐదు టీమ్‌లుగా ఏర్పడి తెల్లవారు జామున 5.30 గంటల నుంచే అన్వేషించారు. కాగా పులి అడుగులు పాకాల 1, అశోక్‌నగర్ 2 బీట్‌లో కనిపించడంతో పెద్ద పులి పాకాల అడవీ ప్రాంతంలో సంచరిస్తునందని నిర్ధ్దారించుకున్నారు. కావున అడవి ప్రాంతం దగ్గరలో ఉన్న గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి ప్రయాణం రద్దు చేసుకోవాలన్నారు. పొలానికి వెళ్లే వారు గుంపులుగా వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా పశువుల కాపరులు, మేకలను, పశువులను అడవిలోకి తీసుకొని వెళ్లవద్దన్నారు. అటవీ ప్రాంతం గుండా సంచరించే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Tiger wandering in Pakala Forest

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News